......................... శరీరధారిగా దేవుడు............................
సాధు సుందర్ సింగ్ గారి రచన
దేవుడు అనే పదమును ఒక పిల్లవాడు ఉచ్చరించ వచ్చును గాని దాని వెనుక దాగియున్న సత్యమును గూర్చి ఎంత మాత్రం ఆలోచించకపోవచ్చును. అయితే అతడు ఎదిగి తర్వాత అతని మనస్సు పరిపక్వమయ్యే కొలది, ఆ పదము గూర్చి ఆలోచించడానికి, అవగాహన చేసుకోనుటకు మొదలు పెడతారు.
అలాగే ఆత్మీయ జీవితములో అడుగుపెట్టిన వ్యక్తి ఉన్నాడు. అతడు విద్యావంతుడైనప్పటికీ "క్రీస్తు ఒక నరవాతారము. ఒక గొప్ప మనిషి. ఒక ప్రవక్త " అని తలంచవచ్చును. అంతకంటే మరెక్కువగా అతడు అంచనా వేయకపోవచ్చును. అయితే అతడు అంతకంతక ఆత్మీయ అనుభవము ఎదిగిన కొలది ఆయన ప్రసన్నతను అనుభవించిన కొలది క్రీస్తు దేవుని శరీర ప్రత్యక్షత అని గ్రహించగలడు. " దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించుచున్నది " ( కొలస్సీ 2:9)
" ఆయనలో జీవముండేను. ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను" ( యోహాను 1:4) అను వాస్తవమును గుర్తించును.
ఒకడు తన వ్యక్తిత్వమునకు సంబంధించిన విషయములను వ్యక్తపరచుటకు ఎంత క్రొత్త పదజాలము ప్రయోగించినను, గుర్తులు మరియు సాదృశ్యాలను ఉదహరించినను సంతృప్తికరమైన భావాలను అందించజాలదు. వ్యక్తిత్వమునకు కారణమైన ప్రాణాత్మ, యొక్క గుణగణములను మరియు శక్తిని శరీరము స్పష్టముగా తెలియజేయలేకపోతోంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ లోకములో జీవించినంత కాలం మానవుని వ్యక్తిత్వం కొంత మట్టుకే వ్యక్తం చేయబడుతుంది. ఎక్కువ భాగం మరుగైయుంటుంది. కేవలము ఆత్మ సంబంధమైన లోక మందు మాత్రము, బాహ్య మరియు అంతరంగ స్థితిగతులు అతని అవసరతలను తీర్చి అభివృద్ధికి తోడ్పడినప్పుడే అత్మ సంబంధి తన్ను తాను సంపూర్ణముగా వ్యక్తపరచుట అసాధ్యము.
నిజముగా మానవుని ఆత్మ విషయం ఇలాగన్నప్పుడు, నిత్యవాక్యము తన దేవత్వమును ఒక శరీరము ద్వారా వ్యక్తపరచుట ఎంత అసాధ్యమో ఆలోచించండి. దేవుడు చాలా మట్టుకు మానవుని రక్షణకు అవసరమైనంత వరకు తన్ను తాను బయలుపరిచెను. అయితే ఆయన అసలైన మహిమ పరలోకమందు మాత్రమే సంపూర్ణముగా ప్రత్యక్షమగును.
కన్నులారా చూడకుండను, సంపూర్ణముగా గ్రహింపకుండను వాస్తవమును ఎలాగు నమ్మగలం..? అనే ప్రశ్న మనలో పుట్టుట సహజమే. ఇక్కడ ఒక ముఖ్యాంశమును చెప్పగోరుచున్నాను. మనము వాస్తవమును నమ్ముటకు వాస్తవమును గూర్చిన సంపూర్ణ జ్ఞానము అవసరం లేదు.
ఉదా - మన శరీరములో కొన్ని అవయవముల మీద..మన ప్రాణము ఆధారపడుచున్నది. అయితే అవి కన్నులకు కనబడుట లేదు. అవి మరుగై యున్నవి ఎవ్వరూ కూడా తన సొంత మెదడును, గుండెను చూడలేదు. అయినను అవి నాకు లేవని అతడు చెప్పజాలడు. మరంత ఎక్కువ మన ప్రాణము ఆధారపడు మన సొంత మెదడు, గుండెలను మనం చూడలేకపోయిన యెడల మన మెదడును, గుండెను సృష్టించిన సృష్టికర్తను చూచుట ఎంత కష్టతరమో చూడండి.
దేవుడు దీవించును గాక.............. ఆమెన్

No comments:
Post a Comment