Sunday, 11 May 2014



క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకముల రచయితలు ఎవరు?

క్రొత్త నిబంధన గ్రంథములో 27 పుస్తకములు స్థిరపడినవనే విషయమును గత వ్యాసములో తెలుసుకొనియున్నాము. వీటిలోని అత్యధిక పుస్తకములను అపొస్తలులు వ్రాయగా అత్యల్ప సంఖ్యలోని పుస్తకములను వారితో అతిదగ్గరి సంబంధాలను కలిగిన వారు వ్రాసినట్లు విశ్వసింపబడుతుంది. వాటిలో ఏయే పుస్తకములను ఎవరెవరు వ్రాసియున్నారనే విషయమును చూచెదము.

క్రొత్త నిబంధన గ్రంథము యొక్క మొత్తం రచయితలు ఎనిమిది మంది. వారిలో నలుగురు అపొస్తలులు కాగా మిగిలిన నలుగురు అపొస్తలులతో చాలా దగ్గర సంబంధాలు కలిగిన వ్యక్తులు. రచయితల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను, పౌలు, పేతురు, యాకోబు, యూదా ఉండగా వారిలో మత్తయి, యోహాను, పౌలు, పేతురు అపొస్తలులు. మార్కు, లూకా, యాకోబు, యూదా అనువారు అపొస్తలులుతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వ్యక్తులు.

రచయితల్లో అపొస్తలులు మాత్రమే 22 పుస్తకములను వ్రాయగా మిగిలినవారు అయిదు పుస్తకములను వ్రాసియున్నట్లు చారిత్రక ఆధారాలు ద్వారా భావిస్తున్నారు. అపొస్తలులులో పౌలు మాత్రమే 14 పుస్తకములను (వాటిలో హెబ్రీయులకు పుస్తకము మీద వాదనలు ఉన్నాయి) వ్రాసియుండగా, యెహాను 5 పుస్తకములను, పేతురు రెండు, మత్తయి ఒక పుస్తకాన్ని వ్రాసియుండెను. మిగిలిన అయిదు పుస్తకముల్లో మార్కు, యాకోబు, యూదా ఒక్కొక్క పుస్తకమును వ్రాయగా, లూకా రెండు పుస్తకములను వ్రాసియున్నట్లు చారిత్రక సంఘటనల ఆధారముగా తెలియుచున్నది.

క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకములు - రచయితలు

1. మత్తయి - మత్తయి
2. మార్కు - మార్కు
3. లూకా - లూకా
4. యోహాను -యెహాను
5. అపొస్తలుల కార్యములు- లూకా
6. రోమీయులకు - పౌలు
7. 1 కొరింథీయులకు - పౌలు
8. 2 కొరింథీయులకు - పౌలు
9. గలతీయులకు - పౌలు
10. ఎఫెసీయులకు - పౌలు
11. ఫిలిప్పీయులకు - పౌలు
12. కొలొస్సయులకు - పౌలు
13. 1 థెస్సలొనీకయులకు- పౌలు
14. 2 థెస్సలొనీకయులకు- పౌలు
15. 1 తిమోతికి - పౌలు
16. 2 తిమోతికి - పౌలు
17. తీతుకు - పౌలు
18. ఫిలేమోనుకు - పౌలు
19. హెబ్రీయులకు - పౌలు
20. యాకోబు - యాకోబు
21. 1 పేతురు - పేతురు
22. 2 పేతురు - పేతురు
23. 1 యోహాను - యోహాను
24. 2 యోహాను - యోహాను
25. 3 యోహాను - యోహాను
26. యూదా - యూదా
27. ప్రకటనల గ్రంథము - యోహాను
-----------------------------

No comments:

Post a Comment