మార్కు సువార్త గ్రంథకర్త ఎవరు?
క్రొత్త నిబంధన గ్రంథములోని తొలి పుస్తకమైన మత్తయి సువార్త గ్రంథకర్త నిర్ధారణ గురించి గత వ్యాసముల్లో చదువుకున్నాము. ప్రస్తుతము రెండవ పుస్తకమైన మార్కు సువార్త గ్రంథకర్త నిర్ధారణ గురించి తెలుసుకొనెదము. గ్రంథకర్తను నిర్ధారించుటకు ముందుగా గ్రంథకర్తను గురించి తెలుసుకొనెదము.
గ్రంథకర్త నిర్ధారణ
మార్కు సువార్త పూర్తిగా యేసు జీవిత చరిత్ర ఆయన బోధనలతోనే కొనసాగడంతో అందులో గ్రంథకర్త ఎవరనే విషయము గురించి ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు కనిపించవు. అయితే చారిత్రక ఆధారాలు బట్టి మార్కు సువార్త గ్రంథకర్త బైబిలునందు పేర్కొనబడిన, అపొస్తలులుతో చాలా దగ్గరి సంబంధాలు కలిగిన మార్కుగానే తెలియుచున్నది. 2వ శతాబ్ధమునకు చెందిన రోమ్ లోని బిషప్ ఇరెనియస్, ప్రాచీన సాక్షియగు అలెగ్జండ్రియాకు చెందిన క్లెమెంట్ తదితరులు మార్కు సువార్త గ్రంథకర్తగా బైబిలు నందు పేర్కొనబడిన మార్కునే సూచించియున్నారు. దీనిని బట్టి చారిత్రక ఆధారాలు ద్వారా మార్కు సువార్త గ్రంథకర్త బైబిలులో పేర్కొనబడిన మార్కుగా తెలియుచున్నది. బైబిలులో మార్కు గురించి పేర్కొనబడిన విషయములను గ్రహించెదము.
* "లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని."2తిమోతికి 4:11
* "నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు." ఫిలేమోనుకు 1:24
పై రెండు వాక్యములోని మొదటి వాక్యమైము తిమోతికి పౌలు వ్రాసిన రెండవ పత్రికలోనిది. ఇందులో "మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు" అనే వాక్యము ద్వారా పరిచారము నిమిత్తము మార్కును పౌలు వినియోగించుకున్నట్లు చెప్పబడినది. అలాగే రెండవ వచనము ఫిలోమోనుకు పౌలు వ్రాసిన పత్రికలోనిది. ఇందులో మార్కును తన జతపనివానిగా పేర్కొనడం బట్టి సువార్త పరిచర్య నిమిత్తము మార్కును పౌలు వినియోగించుకున్నట్లు తెలియుచున్నది. అలాగే పేతురునకు లేఖరిగా మార్కు ఉన్నట్లు హీరపొలిస్ బిషప్ పాపియస్ (క్రీస్తు శకము 70-155) తన సాక్ష్యములో చెప్పబడియుండుట వలన ఆయన అపొస్తలుడైన పేతురునకు కూడా సహాయకుడిగా ఉన్నట్లు తెలియుచున్నది. మార్కును తన కుమారుడిగా (1పేతురు 5:13) పేతురు గ్రంథకర్త పేర్కొనడం వారిద్దరి మధ్య ఆత్మీయ బంధాన్ని వెల్లడిస్తుంది. పేతురు వద్ధ లేఖరిగా ఉండుట వలన మార్కు రచనలో పేతురు శైలి కనిపిస్తుందని బిషప్ పాపియస్ తన సాక్ష్యములో వెల్లడించియున్నారు.
బైబిలులో మార్కు జీవిత చరిత్ర
మార్కుకు యోహాను అను మారుపేరు ఉన్నది. అతని తల్లి పేరు మరియ (అపొస్తలుల కార్యములు 12:12). వీరు యెరుషలేము కాపురస్తులు. పేతురు వారి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ కొందరు కూడి ప్రార్థనలు చేయుట ద్వారా మార్కు కుటుంబము దైవ చింతన కలదని, కొంచెం స్థితిమంతులని తెలియుచున్నది. సౌలు, బర్నబా తమ సువార్తను ప్రారంభించినప్పుడు వారితో పరిచారకుడిగా మార్కు బయలుదేరియుండెను (అపొస్తలుల కార్యములు 12:25). సౌలు, బర్నబా సలమీలోని యూదుల సమాజ మందిరములో వాక్య పరిచర్య చేయుచుండగా వారికి మార్కు పరిచారకుడిగా ఉండెను. అక్కడి నుంచి పంఫిలియాలోని పర్గేకు వెళ్లగా అక్కడి నుంచి మార్కు యెరుషలేముకు తిరుగు ప్రయాణమయ్యాడు (అపొస్తలుల కార్యములు 13:13). సువార్త ప్రకటించిన పట్టణాల్లోని సోదరులను చూచేందుకు వెళ్లూ తనతో పాటు మార్కును వెంటబెట్టుకొని వెళ్లుటకు బర్నబా ఇష్టపడెను (అపొస్తలుల కార్యములు 15:37), దీంతో మార్కును వెంటబెట్టుకొని కుప్రకు వెళ్లెను (అపొస్తలుల కార్యములు 15:39). రోమాలో మొదటిసారి పౌలు చెరపట్టబడిన సమయములో కూడా ఆయనతో పాటు మార్కు కూడా ఉన్నారు (కొలస్సయులకు 4:10, ఫిలేమానుకు 24).

No comments:
Post a Comment